నితిన్ కథతో రామ్ సినిమా ?

Sunday,April 29,2018 - 12:12 by Z_CLU

ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరూ ఒక్కో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో డిఫరెంట్ గా ఆలోచించే డైరెక్టర్స్ పై కర్చీపులు వేస్తూ నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా రాజశేఖర్ తో  ‘గరుడ వేగ’ అనే  సినిమా తెరకెక్కించి డైరెక్టర్ గా తన సత్తా ఏంటో నిరుపించుకున్న ప్రవీణ్ సత్తారుపై కూడా కొందరు కుర్ర హీరోలు కర్చీపు వేయాలని చూసారు. అయితే గరుడ వేగ థియేటర్స్ లో ఆడుతుండగానే ప్రవీణ్ తో సినిమా అనౌన్స్ చేశాడు నితిన్. అనౌన్స్ అయితే చేసాడు కానీ ఆ సినిమా ఉండకపోవచ్చని వార్తలొచ్చాయి.

నితిన్ కూడా ఇప్పుడే ఆ సినిమా ఉండకపోవచ్చంటూ ఈ మధ్యే క్లారిటీ కూడా ఇచ్చేసాడు. అయితే లేటెస్ట్ గా ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలతో లాంచ్ కూడా చేసేసాడు రామ్.

ప్రవీణ్ సత్తరు నితిన్ కోసం రాసిన కథతోనే రామ్ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నితిన్ హోల్డ్ లో పెట్టడంతో ప్రవీణ్ అదే కథను రామ్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే నితిన్ కోసం రాసిన కథతోనే ప్రవీణ్ ఈ సినిమా చేస్తున్నాడా..లేదా నితిన్ తో నెక్స్ట్ సినిమా చేస్తాడా.. చూడాలి.