Hot Topic మహేష్ సినిమాలో నాని ?

Friday,May 20,2022 - 12:44 by Z_CLU

Hot Topic : Nani doing a special role in SSMB28 ?

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని షూటింగ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబందించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో నాని ఓ స్పెషల్ కేరెక్టర్ చేయనున్నాడని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.

నిజానికి సినిమాలో సెకండ్ మెయిన్ రోల్ ఒకటి ఉందట. దాన్ని నానితో చేయిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడని టాక్. ఇటివలే నానికి స్టోరీ నెరేషన్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ న్యూస్ లో నిజమెంత అనేది పక్కన పెడితే  మహేష్ సినిమాలో నాని అంటూ #SSMB28 సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

మేకర్స్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో  బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. జూన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

 * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics