'దటీజ్ మహాలక్ష్మి' అంటున్న తమన్నా

Wednesday,June 06,2018 - 03:55 by Z_CLU

ప్రెజెంట్  క్వీన్ రీమేక్  లో నటిస్తుంది తమన్నా. లేటెస్ట్ గా ఈ సినిమాకు  ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. రీసెంట్ గా  షూటింగ్ స్పాట్ లో పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు చేసిన యూనిట్ ఈ టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించారు. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి  తెరకెక్కుతున్న  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో  శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం తమన్నా , కాజల్ , పరుల్ యాదవ్ లతో పాటు మరికొంత మంది ఆర్టిస్టులపై కొన్ని సీన్స్  షూట్ చేస్తున్నారు యూనిట్. మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మను కుమారన్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. అమిత్ త్రివేది  మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.