సాహో టీజర్ రెడీ !

Sunday,June 02,2019 - 02:10 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా టీజర్ రెడీ అయింది.. రంజాన్ సందర్భంగా జూన్ 4న  ఈ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ మధ్య ‘షేడ్స్ ఆఫ్ సాహో’ పేరుతో మేకింగ్ వీడియోస్ లతో హంగామా చేసిన సాహో రంజాన్ నుండి టీజర్ తో హల్చల్ చేయనుంది.

యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ప్రభాస్ పవర్ డైలాగ్ తో ఈ టీజర్ కట్ చేసారని తెలుస్తోంది. ఈ టీజర్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాపై హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.