Sarkaru Vaari Paata - సంక్రాంతి స్పెషల్

Saturday,January 30,2021 - 04:39 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల దుబాయ్‌లో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.. గ‌తంలో సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చిత్రాలు `ఒక్క‌డు` ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలి‌చింది, అలాగే `బిజినెస్‌మేన్` సెన్సేష‌న‌ల్ హిట్ట‌య్యింది, `స‌రిలేరు నీకెవ్వ‌రు` సెన్సేష‌న‌ల్ ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఇలా సంక్రాంతికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కి మంచి విజ‌యాలున్నాయి.

Mahesh Babu sarkaru Vaari Paata Sankranthi release

ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఎంతో ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని కూడా 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.