Venkatesh Narappa - రిలీజ్ డేట్

Saturday,January 30,2021 - 04:33 by Z_CLU

సురేష్ ప్రొడక్షన్స్, వి-క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`.

విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ షూటింగ్ జ‌న‌వ‌రి 31తో పూర్తికానుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

నటీనటులు – విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
కథ: వెట్రిమారన్‌,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ,
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.