మహేష్ పారితోషికం ఎంతో తెలుసా...?

Saturday,October 15,2016 - 03:49 by Z_CLU

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ స్టార్ హీరోలకు పోటీనిచ్చే స్థాయికి ఎదిగాడు. అయితే మహేష్ పోటీ ఇస్తుంది సినిమాలతో కాదు తన రెమ్యునరేషన్ తో. అవును తన అప్ కమింగ్ మూవీస్ కోసం కెరీర్ లోనే హయ్యస్ట్ పారితోషికాలు అందుకుంటున్నాడట. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వం లో చేస్తున్న సినిమాకు మహేష్ 23 నుంచి 26 కోట్ల రూపాయల మధ్య పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది.

   కేవలం మురుగదాస్ సినిమాకే కాదు త్వరలో కొరటాల శివతో చేయబోయే సినిమాకు కూడా ఇదే రేంజ్ లో డీల్ కుదుర్చుకున్నాడట మహేష్. ఇక పీవీపీ బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న మహేష్… ఆ సంస్థ నుంచి కూడా భారీ మొత్తానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇలా తన రెమ్యునరేషన్ తో బాలీవుడ్ స్టార్ హీరోల స్థాయికి చేరిపోయాడట మహేష్ బాబు.