నటసింహం హంగామా...

Saturday,October 15,2016 - 03:36 by Z_CLU

నందమూరి బాలకృష్ణ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్ర టీజర్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. విడుదలైన నాలుగు రోజులకే 20 లక్షల వ్యూస్ సాధించి టీజర్ తో హాట్ టాపిక్ గా మారాడు బాలయ్య. ఇప్పటివరకూ ఏ సీనియర్ హీరోకి ఈ రేంజ్ వ్యూస్ రాకపోవడంతో నందమూరి అభిమానుల్లో పండగ మొదలైంది. దీనికి తోడు తాజాగా సినిమాలో హేమమాలిని గెటప్ ను కూడా విడుదల చేశారు. రాజమాత బాలశ్రీగా హేమమాలిని గెటప్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

14729256_1246813592030465_2422338824661092079_n

      ముఖ్యంగా బాలయ్య ఈ టీజర్ లో శాతకర్ణి గెటప్ లో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్, యుద్ధ సన్నివేశాలు అభిమానులతో పాటు… ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి బాలయ్య నటిస్తున్న 100 వ సినిమా కావడం, ఇప్పటికే టీజర్ అంచనాలను తారాస్థాయికి చేర్చడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.