బంగారం లాంటి ఆఫర్..

Saturday,October 15,2016 - 03:57 by Z_CLU

తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా స్టాండర్డ్ ను ఓ మెట్టు పైకి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచి… నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇంతటి సెన్సేషన్ సృష్టించిన సినిమాలో అవకాశం వస్తే కాదు పొమ్మంది బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. ఇప్పుడు ఛాన్స్ వదులుకున్నందుకు తీరిగ్గా బాధపడుతోంది.

     బాహుబలి ప్రాజెక్టు సెట్స్ పైకి రాకముందే సోనమ్ కపూర్ కి ఓ క్యారెక్టర్ అఫర్ చేశాడట జక్కన్న. అయితే ఆ అఫర్ ను తిప్పికోట్టిందట బాలీవుడ్ భామ. అయితే తాజాగా ఈ వార్త బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ బాహుబలి లో రోల్ కి ఈ అమ్మడు ఎందుకు నో చెప్పినట్లు? సోనమ్ కి బాహుబలి లో జక్కన్న ఏ క్యారెక్టర్ ఇద్దామనుకున్నాడు? అన్న సందేహం అందరికీ ఉంది. బాహుబలిలో తమన్న చేసిన పాత్రనే సోనమ్ కపూర్ కు ఆఫర్ చేశాడట రాజమౌళి.