మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయింది

Monday,June 11,2018 - 01:12 by Z_CLU

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ తరవాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాతో బిజీ కానున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ పై క్రియేట్ అయి ఉన్న సస్పెన్స్ వీడింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ కి మహేష్ బాబు అటెండ్ అవడంతో, అందరి కాన్సంట్రేషన్ మహేష్ బాబు పై మళ్ళింది.

వంశీ పైడిపల్లి టీమ్ అఫీషియల్ గా ఇప్పటి వరకు మహేష్ బాబు లుక్స్ ని రిలీజ్ చేయలేదు. కానీ నిన్నటి ఈవెంట్ లో మహేష్ బాబు మీసం, గెడ్డంతో పాటు డిఫెరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించేసరికి ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ అవేనని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్. భరత్ అనే నేను సినిమాలో స్టైలిష్ CM గా కనిపించిన మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ గెటప్ లో మెస్మరైజ్ చేయనున్నాడు.

 

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అల్లరి నరేష్  ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.  న్యూయార్క్ లాంటి లావిష్ లొకేషన్ లలో తెరకెక్కనున్న ఈ సినిమాని అశ్వని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.