శైలజారెడ్డి అల్లుడు.. నా కెరీర్ బెస్ట్

Monday,June 11,2018 - 12:13 by Z_CLU

నా పేరు సూర్య సినిమాలో బన్నీ సరసన నటించింది. మజ్నులో నానితో వర్క్ చేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది. కానీ ఇవేవీ తన కెరీర్ బెస్ట్ కావంటోంది అను ఎమ్మాన్యుయేల్. నటిగా తనకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం వేరే ఉందంటోంది.

అను ఎమ్మాన్యుయేల్ మనసుకు అంతగా నచ్చిన ఆ సినిమా శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తను చేస్తున్న రోల్.. తన కెరీర్ బెస్ట్ అంటోంది అను. సినిమాలో తను మోస్ట్ ఇగోయిస్ట్ పర్సన్ గా కనిపిస్తానని.. ఆ క్యారక్టర్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశానని చెబుతోంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది శైలజారెడ్డి అల్లుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మారుతి-చైతూ కాంబోలో ఇదే మొదటి సినిమా.