చైతూ నుంచి మరో మూవీ...

Monday,October 24,2016 - 03:20 by Z_CLU

ప్రస్తుతం ప్రేమమ్ సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతున్నాడు నాగచైతన్య. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో, అదే ఊపులో వెంటనే మరో సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా త్వరలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు.

     నిజానికి ప్రేమమ్ కంటే ముందే సాహసం శ్వాసగా సాగిపో సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రేమమ్ కంటే ముందే విడుదల కూడా చేయాలని అనుకున్నారు. కానీ తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి… తమిళ వెర్షన్ పనులు ఇంకా పూర్తికాలేదు. అందుకే తెలుగులో కూడా ఈ మూవీ విడుదలను ఆపేశారు. తాజాగా తమిళ వెర్షన్ పనులు పూర్తయ్యాయి. తమిళనాట ఈ సినిమా ట్రయిలర్ కూడా విడుదలైంది. సో.. త్వరలోనే తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.