మహానటి 6 వారాల వసూళ్లు

Wednesday,June 20,2018 - 03:47 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహానటి సినిమా సక్సెస్ ఫుల్ గా 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం కూడా పూర్తిచేసుకుంటే 50 రోజుల రన్ కంప్లీట్ అవుతుంది. విడుదలైన ఈ 6 వారాల్లో మహానటి సినిమాకు వరల్డ్ వైడ్ 43 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

విడుదలైన మూడో వారానికే బ్రేక్ ఈవెన్ సాధించిన మహానటి.. నాలుగో వారం మొదటి రోజు నుంచి బయ్యర్లకు లాభాలు అందిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాకు నైజాంలో వసూళ్లు వస్తుండడం విశేషం. అటు ఓవర్సీస్ లో కూడా మహానటి సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఏపీ, నైజాం 6 వారాల షేర్
నైజాం – రూ. 11.70 కోట్లు
సీడెడ్ – రూ. 2.95 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.86 కోట్లు
ఈస్ట్ – రూ. 2.43 కోట్లు
వెస్ట్ – రూ. 1.61 కోట్లు
గుంటూరు – రూ. 2.10 కోట్లు
కృష్ణా – రూ. 2.45 కోట్లు
నెల్లూరు – రూ. 1 కోటి