శ్రీనివాస్ రెడ్డి ఇంటర్వ్యూ

Wednesday,June 20,2018 - 05:29 by Z_CLU

అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ‘జంబలకిడి పంబ’. బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా నటించారు. రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి మీడియాతో మరెన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ విషయాలు మీకోసం… 

అంతా కథే…

నా గత సినిమాలు గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, రీసెంట్ గా ఆనందో బ్రహ్మ సినిమాల్లో లాగే ఈ సినిమాలో అంతా కథే ఉంటుంది, ఎక్కడా హీరోయిజం ఉండదు. ఇంకో మాట చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ కే ఎక్కువ స్కోప్ ఉంటుంది…

అదే జంబలకిడి పంబ…

సినిమాలో ఒకచోట ముఖ్యంగా బాడీ స్వాపింగ్ సిచ్యువేషన్ లో ‘జంబలకిడి పంబ’ అనే మంత్రాన్ని వాడతాం… ఎట్లాగూ ఆ పదం వాడేశాం కదా టైటిల్ కూడా అదే పెట్టేద్దాం అని ఫిక్సవ్వడం జరిగింది.

 

ముందు భయపడ్డా…

‘జంబలకిడి పంబ’ టైటిల్ అనగానే కంపల్సరీగా అలాంటి సినిమానే ఎక్స్ పెక్ట్ చేస్తారేమో అనే కంగారు పడ్డా.. కానీ ఫస్ట్ కాపీ చూశాక అలా ఏం అనిపించలేదు. అందునా సినిమా మధ్యలో ఆ పదం వాడాం కాబట్టి, ఈ కథకి ఆ టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది..

సెన్సార్ సభ్యులు కూడా…

ఆడవారి సమస్యల గురించి చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఆ విషయంలో సెన్సార్ వాళ్ళు కూడా అప్రీషియేట్ చేశారు. కొన్ని విషయాలు స్వయంగా అనుభవిస్తే గానీ ఒకరి సమస్యలు ఒకరికి అర్థం కావు అనేది ఈ సినిమాలో కీ పాయింట్…

ఇంట్లో నైటీ వేసుకున్నా…

ఈ సినిమా కోసం పెద్దగా హోమ్ వర్క్ లాంటివి చేయలేదు కానీ, నెక్స్ట్ డే కాస్ట్యూమ్స్ ఇంట్లో ట్రై చేసి చూసుకునే వాణ్ణి.. నైటీ వేసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంట్లో వేసుకుని చూసుకునే వాణ్ణి.. బావున్నానా లేదా..? బాలేకపోతే ఏం చేయాలి…? ఎలా కనిపించాలి.. అలాంటి విషయాల్లో హోమ్ వర్క్ చేశాను…

ఇది కూడా క్యారెక్టరే..

నేను హీరోనైపోయాను అనే ఫీలింగ్ ఎప్పుడూ లేదు.. ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి మంచి కథలు పడితే, ఇలా ఫుల్ లెంత్ రోల్స్ చేస్తుంటా.. అంతే. అరవింద సమేత, F2, అమర్-అక్బర్- ఆంథోని, రిలీజ్ కి రెడీగా ఉన్న ‘పంతం’లో కూడా నటించాను…

ఆట పట్టిస్తుంటారు…

ఇప్పుడీ సినిమాలో హీరోగా నటించి వేరే సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు హీరోల దగ్గర్నించి డైరెక్టర్స్ వరకు ఆట పట్టిస్తుంటారు… మనది మల్టీస్టారర్ సినిమా అని నవ్వుతుంటారు…

 

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు…

ఫ్లయింగ్ కలర్స్ అని మేమో 13 మంది కమెడియన్స్ కలిసి ఒక బ్యానర్ పెట్టుకున్నాం. త్వరలో ఆ బ్యానర్ లో ‘భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు’ సినిమా చేయబోతున్నాం… ఈ సినిమాలో ఇండస్ట్రీ మ్యాగ్జిమం కమెడియన్స్ నటిస్తారు…

త్రివిక్రమ్ మాట మర్చిపోను…

ఒక సినిమా హిట్టయింది  కాబట్టి  నెక్స్ట్   బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే ఆలోచన నాకు లేదు. త్రివిక్రమ్ గారు నాకొకటే చెప్పారు. ‘అస్సలు ప్రెజర్ పెట్టుకోకు… క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం మానకు…’ నేను కూడా అంతే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మెయిన్.. ఎప్పుడైనా మంచి కథ దొరికితేనే  హీరోగా చేస్తా…

ఫ్రెండ్ షిప్ కోసం చేయలేదు…

గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. మను గారికి ఆయన చాలా క్లోజ్. ఈ సినిమా విషయానికి వస్తే ఫ్రెడ్ షిప్ పక్కన పెట్టి జస్ట్ కథ నచ్చి అయన ఈ సినిమా చేశారు. ప్రోమో సాంగ్ నుండి బిగిన్ అయితే సినిమాలో ప్రతి సాంగ్ అద్భుతంగా వచ్చింది…

ప్రొడ్యూసర్స్ గురించి…

ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడ్యూసర్స్. ఒక క్యారెక్టర్ కి ఈ ఆర్టిస్ట్ సరిపోతాడు అనుకుంటే, అంతే వాళ్ళనే ఫిక్స్ చేసుకున్నారు… హీరోయిన్ విషయంలో చాలామందిని చూశాం.. చివరికి సిద్ధి పర్ఫెక్ట్ అని ఫిక్సయ్యాం…

సిద్ధి ఇద్నాని స్కోర్…

సినిమాలో ఇంతమంది ఆర్టిస్ట్ లు ఉన్నా, సిద్ధి పర్ఫామెన్స్ హైలెట్ అవుతుంది. అంత బాగా నటించింది. సినిమా చూశాక మీరూ అదే మాట అంటారు…