మరో మేజిక్ క్రియేట్ చేసిన మహానటి

Saturday,May 19,2018 - 12:24 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహానటి సినిమా మరో రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అందుకుంది ఈ సినిమా. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ ఘనత సాధించింది మహానటి మూవీ.

విడుదలైన 4 రోజులకే మిలియన్ మార్క్ అందుకున్న ఈ సినిమా, 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడానికి అదనంగా మరో 6 రోజులు టైం తీసుకుంది. ఈ సినిమాకు నిన్నట్నుంచి ఓవర్సీస్ లో థియేటర్లు పెంచారు. ఏకంగా 17 స్క్రీన్స్ కేటాయించారు. అందుకే అనుకున్న టైమ్ కంటే ఓ 2 రోజులు ముందే మహానటి 2 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ప్రతి సెంటర్ లో సూపర్ హిట్ అయింది. ఏపీ, నైజాంలో ఇప్పటికే 12 కోట్ల రూపాయల షేర్ క్రాస్ చేసిన ఈ మూవీ, ఈ వీకెండ్ నాటికి 15 కోట్ల రూపాయల మార్క్ అందుకోబోతోంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.