మహానటి క్లోజింగ్ కలెక్షన్

Thursday,June 28,2018 - 11:01 by Z_CLU

నిన్నటితో 50 రోజులు పూర్తిచేసుకుంది మహానటి. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా నిర్మాత అశ్వనీదత్ కు కాసుల వర్షం కురిపించింది. విడుదలైన ప్రతి సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు తెచ్చిపెట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయి, వైజయంతీ మూవీస్ బ్యానర్ లో మరో హిట్ సినిమాగా నిలిచింది.

అలనాటి మేటినటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించినప్పటికీ.. అంతిమంగా ఇది డైరక్టర్స్ మూవీగా పేరుతెచ్చుకుంది. ఇక ఏపీ, నైజాంలో మహానటి క్లోజింగ్ కలెక్షన్ ఇలా ఉంది

ఏపీ, నైజాం ఫైనల్ షేర్
నైజాం – రూ. 11.80 కోట్లు
సీడెడ్ – రూ. 3 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.93 కోట్లు
ఈస్ట్ – రూ. 2.50 కోట్లు
వెస్ట్ – రూ. 1.67 కోట్లు
గుంటూరు – రూ. 2.17 కోట్లు
కృష్ణా – రూ. 2.50 కోట్లు
నెల్లూరు – రూ. 1.03 కోట్లు

టోటల్ షేర్ – రూ. 28.60 కోట్లు