Love Story టార్గెట్ పెట్టుకున్నారు!

Sunday,August 30,2020 - 02:21 by Z_CLU

అన్ని అనుకున్నట్లు జరిగితే NagaChaitanya – Sai Pallavi లతో శేఖర్ కమ్ముల తీస్తున్న ‘Love Story’ ఈ పాటికి థియేటర్స్ లోకి వచ్చేసేది. కానీ కరోన ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా చివరి 15 రోజుల షూట్ వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితి కొంత వరకు చక్కబదుతుండటంతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు. వచ్చే నెల నుండి మిగిలిన కొంత షూట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్సయ్యారు.

డాన్స్ నేపథ్యంలో క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న Akkineni Sentiment అయిన డిసెంబర్ నెలలో థియేటర్స్ లోకి తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. ఇంకా నాలుగు నెలలు ఉంది కాబట్టి ఈ లోపు థియేటర్స్ ఓపెన్ అవ్వడం, ప్రేక్షకులు మళ్ళీ సినిమాలకి రావడం జరుగుతుందని భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై నారాయణ దాస్ నరంగ్, రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.