నాని నాకు స్ఫూర్తి: నివేత థామస్

Sunday,August 30,2020 - 02:32 by Z_CLU

ఓటీటీ అవకాశాలు, స్క్రిప్ట్ సెలక్షన్, బెస్ట్ ఫ్రెండ్స్, డైరక్షన్.. ఇలా చాలా అంశాలపై రియాక్ట్ అయింది హీరోయిన్ నివేత థామస్ (Nivetha Thomas). తనకు స్టార్ డమ్ అక్కర్లేదని, మంచి క్యారెక్టర్స్ దొరికితే చాలంటున్న ఈ బ్యూటీ.. ఇంకా ఏమంటుందో చూద్దాం.

నానితో అనుబంధం..
– నానితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ త‌న‌ు నాకు మంచి ఫ్రెండ్‌. నాకు ఏదైనా కథ నచ్చితే.. తనతో డిస్కస్ చేస్తుంటాను. అలాగే త‌న సినిమాల్లోని పాత్ర‌లు గురించి నాతో డిస్క‌స్ చేస్తుంటాడు. త‌ను చాలా విషయాల్లో నాకు ఇన్ స్పిరేషన్.

లాక్‌డౌన్ స‌మ‌యంలో…
– లాక్‌డౌన్ స‌మ‌యంలో అనే కాదు.. రెగ్యులర్‌గా నేను కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటాను. పుస్త‌కం చ‌దువుతుంటాను. ఏదైనా సాఫ్ట్ వేర్ గురించి తెలుసుకుంటూనే ఉంటాను. నేను చేస్తున్న‌, చేయాల‌నుకున్న సినిమాల స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్స్ గురించి డిస్క‌స్ చేస్తుంటాను. లాక్‌డౌన్ స‌మ‌యంలో కుటుంబంతో గ‌డ‌ప‌డాన్ని బాగా ఎంజాయ్ చేశాను.

స్టార్ డ‌మ్ గురించి…
– స్టార్ గురించి నేను అస్స‌లు ఆలోచించ‌ను. ఇప్పుడు నేనున్న ఈ స్థాయిని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓ మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అని నేను భావిస్తాను.

ఓటీటీ అవ‌కాశాలు..
– ఇప్పుడు చాలా మంది ఓటీటీల్లో న‌టిస్తున్నారు. న‌న్నుఓటీటీలో న‌టించ‌మ‌ని ఎవ‌రూ అడ‌గ‌లేదు. అవ‌కాశం వ‌స్తే ఆలోచిస్తాను.

అప్ కమింగ్ మూవీస్…
– ఈ లాక్ డౌన్ గ్యాప్‌లో నేను మూడు తెలుగు స్క్రిప్ట్ విన్నాను. అవ‌న్నీ డెవ‌ల‌ప్‌మెంట్స్‌లో ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను.

ద‌ర్శ‌క‌త్వం…
– ప్ర‌స్తుతానికి నేను న‌టిని మాత్ర‌మే. నన్నెవ‌రూ పిలిచి డైరెక్ష‌న్ ఛాన్స్ ఇవ్వ‌రు. నేను అవ‌కాశం కోసం వెళ్లాల్సి ఉంటుంది. అయితే వెంట‌నే సినిమా డైరెక్ష‌న్ చేసేయ‌ను.. షార్ట్ ఫిలింస్ చేస్తాను.. అలా క్ర‌మంగా సినిమా డైరెక్ట్ చేస్తాను.

నెపోటిజం…
– నెపోటిజం వ‌ల్ల న‌టిగా.. నేను ఎలాంటి స‌మస్యలు ఫేస్ చేయ‌లేదు.