Nagachaitanya LoveStory - రిలీజ్ పై క్లారిటీ!

Wednesday,June 16,2021 - 01:47 by Z_CLU

నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరి’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత. సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు చెప్తూ జులై నెలాఖరు లేదా ఆగస్ట్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు. ” జులై మొదటి వారానికి పరిస్థితులు అన్ని చక్కబడతాయని సమాచారం ఉంది. ఆ వెంటనే థియేటర్స్ కి పర్మీషన్ రానుంది. అయితే నైట్ కర్ఫ్యూ ఇంకా కొన్ని రోజులు కొనసాగనుంది. నైట్ కర్ఫ్యూ తొలగించిన వారానికే మా ‘లవ్ స్టోరి’ రిలీజ్ చేయాలని భావిస్తున్నాం” అంటూ ఇటివలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నిర్మాత సునీల్ నారంగ్.

నిజానికి లవ్ స్టోరీ పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ పక్కా అనుకునే లోపు సరిగ్గా లాక్ డౌన్ వచ్చింది. దీంతో సినిమాను వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతుంది. జులై మొదటి వారంలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఆలస్యం అవ్వడంతో థియేటర్స్ లో యాబై శాతం ఆక్యుపెన్సీ తో పర్మీషణ్ ఇచ్చిన రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు నిర్మాతలు.

ఇక గతేడాది లాక్ డౌన్ అనంతరం విడుదలైన సినిమాలు బాగానే కలెక్ట్ చేశాయి. ముఖ్యంగా లాక్ డౌన్ తర్వాత రిలీజైన ఉప్పెన లాంటి లవ్ స్టోరి ఎంత కలెక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే. పైగా లవ్ స్టోరి సాంగ్స్, టీజర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసి అంచనాలు పెంచేశాయి. అందుకే ‘లవ్ స్టోరి’ పై మంచి భరోసాతో ఉన్నారు నిర్మాతలు. ఒక వేళ అన్ని అనుకున్నట్లు జరిగితే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత థియేటర్స్ లో అతిపెద్ద రిలీజ్ అంటే ఈ సినిమానే అవుతుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics