హాట్ టాపిక్: Trivikram నెక్స్ట్ ఏంటి?

Sunday,August 30,2020 - 11:58 by Z_CLU

మాటల మాంత్రికుడు Trivikram Srinivas నెక్స్ట్ సినిమా ఎవరితో ? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ‘అల వైకుంఠపురములో’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా NTR తో సినిమా అనౌన్స్ చేశాడు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ‘RRR’ షూటింగ్ అనుకున్న సమయానికి జరగకపోవడంతో తారక్ -త్రివిక్రమ్ సినిమా వెనక్కి జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జక్కన్న సినిమా పూర్తి చేసాకే త్రివిక్రమ్ సినిమా చేస్తాడు.

ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఫలానా హీరోతో సినిమా చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. మొదట్లో త్రివిక్రమ్ లిస్టులో నాని పేరు వినిపించగా తర్వాత Venkatesh తో ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ నడిచింది. ఇక హీరో రామ్ తో త్రివిక్రమ్ సినిమా ఫైనల్ అయ్యిందనే ప్రచారం కూడా జోరుగా సాగింది.

ఇక మరోవైపు Megastar తో త్రివిక్రమ్ చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా చర్చ దశలో ఉందనే టాక్ వినబడుతుంది. ఇలా మాటల మాంత్రికుడి నెక్స్ట్ సినిమా రోజుకో హీరోతో ప్రచారం సాగుతుంది. మరి వీటన్నిటికి ఫుల స్టాప్ పడాలంటే త్రివిక్రమ్ క్లారిటీ ఇవ్వాల్సిందే. లేదా తారక్ సినిమా షూట్ గురించి అప్డేట్ తెలియాలి.