రెండో సినిమాకు లాంగ్ గ్యాప్

Saturday,April 21,2018 - 10:17 by Z_CLU

మొదటి సినిమా తర్వాత రెండో సినిమాకు కాస్త టైం తీసుకోవడం కామనే.. అయితే టాలీవుడ్ లో కొందరు దర్శకులు మాత్రం మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి రెండో సినిమాకు భారీ గ్యాప్ తీసుకున్నారు. అలా గ్యాప్ తీసుకున్న కొందరు దర్శకులు ఈ ఏడాది క్రేజీ మూవీస్ తో థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ దర్శకులపై జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

 

మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ తో సూపర్ హిట్ అందుకొని రెండో సినిమాకి 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ‘రన్ రాజా రన్’ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రభాస్ కి ఓ స్క్రిప్ట్ రెడీ చేసిన సుజీత్ దాదాపు 4 ఏళ్ల పాటు వెయిట్ చేసాడు. ఇక ఈ లాంగ్ గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ప్రభాస్ సాహో అనే టైటిల్ తో సినిమా సెట్స్ పై పెట్టేసి ఈ సినిమాతో బిజీ అయిపోయాడు సుజీత్.

 

ప్రస్తుతం కీర్తి సురేష్ తో సావిత్రి బయోపిక్ తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్స్ సందడి చేయబోతున్నాడు. మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తో తానెంతో నిరుపించుకున్న ఈ దర్శకుడు రెండో సినిమాకు కాస్త గ్యాప్ తీసుకొన్నప్పటికీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. ‘మహానటి’ అనే టైటిల్ తో సావిత్రి బయోపిక్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాతో తన గ్యాప్ ని భర్తీ చేయబోతున్నాడు.

 

2014 ‘రౌడీఫెలో’ అనే సినిమాతో దర్శకుడిగా రచయితగా మంచి గుర్తింపు అందుకున్న కృష్ణ చైతన్య రెండో సినిమాకి దాదాపు నాలుగేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యే రెండో సినిమా  ‘ఛల్ మోహన్ రంగ’ తో థియేటర్స్ లో సందడి చేసిన ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాకు మాత్రం ఇంత గ్యాప్ ఉండకుండా చూసుకుంటున్నాడు.

‘ది ఎండ్’ అనే చిన్న సినిమాతో అప్పట్లో సందడి చేసిన యంగ్ డైరెక్టర్ రాహుల్ రెండో సినిమాకు దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం టాక్సీవాలా అంటూ విజయ్ ని మరో కొత్త ఆంగిల్ లో పరిచయం చేస్తూ త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా టీజర్ తో ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యాడు రాహుల్.

2011 లో సిద్దార్థ్ హీరోగా ‘180’ అనే సినిమా తీసి తమిళ్ తో పాటు తెలుగులోనూ సందడి చేసిన దర్శకుడు జయేంద్ర ఓ ఏడేళ్ళ గ్యాప్ తర్వాత ఎట్టకేలకు మళ్ళీ ఓ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కళ్యాణ్ రామ్-తమన్నా లతో ‘నా నువ్వే’ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాను తెరకెక్కించిన జయేంద్ర వచ్చే నెలలో ఈ సినిమాతో హంగామా చేయబోతున్నాడు.

‘అలా ఎలా’ అనే ఓ చిన్న సినిమాతో పెద్ద హిట్ అందుకున్న అనిష్ కృష్ణ కూడా దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా అందరినీ అలరించి సూపర్ హిట్ హిట్ అందుకున్న అనీష్ కృష్ణ ప్రస్తుతం రాజ్ తరుణ్ తో లవర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో యూత్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఓ సూపర్ హిట్ అందుకొనే ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

పెళ్లిచూపులు అనే చిన్న సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ సాధించిందో.. తెలిసిందే.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ రెండో సినిమాకి రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కొత్త వారితో మరో యూత్ లవ్ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఈ ఏడాదిలో మళ్ళీ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.