మరో స్టార్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్

Saturday,April 21,2018 - 11:03 by Z_CLU

ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు అఖిల్. అయితే ఓ వైపు ఈ సినిమాతో బిజీగా ఉంటూనే, మరో వైపు తన నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ కూడా బిగిన్ చేసేశాడు అఖిల్. ‘హలో’ సినిమా తరవాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఫిక్స్ యిన అఖిల్, ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సెట్స్ పైకి రానున్నాడు.

ప్రస్తుతం U.S. వెకేషన్ లో ఉన్న సుకుమార్, అక్కడి నుండి వచ్చీ రాగానే మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ ని బిగిన్ చేస్తాడు. ఈ సినిమా తరవాత అఖిల్ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాడు సుక్కు. ఈ విషయాన్ని స్వయంగా రీసెంట్ గా ‘జీ సినిమాలు’ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో రివీల్ చేశాడు సుకుమార్.

 

ప్రస్తుతం డిస్కర్షన్స్  స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఎగ్జాక్ట్ గా ఎప్పుడు సెట్స్ పైకి రానుంది..? ప్రొడ్యూసర్ ఎవరూ.? లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.