#VS11  విశ్వక్ కొత్త సినిమా మొదలు

Wednesday,April 26,2023 - 03:17 by Z_CLU

విశ్వక్ సేన్  ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న ‘VS11′(వర్కింగ్ టైటిల్) పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈచిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోయన్‌పల్లి వెంకట్, సుధాకర్ చెరుకూరి, రామ్ ఆచంట, గోపీ ఆచంట, సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకులు వెంకీ అట్లూరి, మల్లిక్ రామ్, శ్రీకాంత్ ఎన్ రెడ్డి, కళ్యాణ్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

విశ్వక్ సేన్ తన అద్భుతమైన కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. స్వతహాగా విజయవంతమైన రచయిత, దర్శకుడు కావడంతో ఈ యువ నటుడు విభిన్నమైన జానర్‌లతో మనల్ని అలరిస్తున్నారు. ఈసారి కూడా కూడా మరో విభిన్న జానర్ లో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఈ కథ పట్ల,  పాత్ర పట్ల విశ్వక్ సేన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

90వ దశకంలో రాజమండ్రి పరిసరాల నేపథ్యంలో జరిగిన కథతో రూపొందుతోన్న ‘VS11’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరకర్త. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాది, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్ గా జాతీయ అవార్డు విజేత నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. అటువంటి ప్రతిభావంతులైన మరియు నిష్ణాతులైన బృందంతో కలిసి.. కథల ఎంపికలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘VS11’ రూపంలో మరో ఆసక్తికర చిత్రాన్ని అందించబోతున్నట్లు హామీ ఇస్తోంది.

మే నుండి VS11 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర ముఖ్య తారాగణం వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ని అందిస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు.

Vishwak Sen's #VS11 commences with Pooja Ceremony, Shoot Begins Mid May

Vishwak Sen’s #VS11 commences with Pooja Ceremony, Shoot Begins Mid May