Pawan Kalyan డిసెంబర్ నుండే పవన్ సుజీత్ సినిమా ?

Monday,December 05,2022 - 02:26 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ (Pawan Kalyan) నెక్స్ట్ సుజీత్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ కాంబో అనౌన్స్ మెంట్ పోస్టర్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. సుజీత్ (Sujeeth) పవన్ ను ఓ పవర్ ఫుల్ గన్ లా చూపించబోతున్నాడని పోస్టర్ లో పవన్ షాడో చూస్తే అర్థమవుతుంది. అలాగే సునామి వస్తుంది అన్నట్టుగా సంకేతం ఇచ్చాడు సుజీత్. ఈ కాంబో సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.

ప్రీ లుక్ తో ఓ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ మరే డీటెయిల్స్ చెప్పలేదు. అయితే తాజాగా సమాచారం మేరకు పవన్ ఈ సినిమాను ఇదే నెలలో మొదలు పెట్టనున్నాడని తెలుస్తుంది. నెలాఖరు నుండి హైదరాబాద్ లో షూట్ జరగనుందని అంటున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా సినిమా లాంచ్ కానుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics