ఎట్రాక్ట్ చేస్తున్న కుంగ్ ఫు యోగ ట్రేలర్

Wednesday,January 18,2017 - 11:42 by Z_CLU

 ఇండియన్ సినిమా బ్యారియర్స్ చెరిపేస్తుంది. ఓ వైపు ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ సినిమాల్లో నటించి, మేము ఎవరికీ తక్కువ కాదు అని నిరూపించుకుంటుంటే, ఇప్పుడు జాకీచాన్ నటించిన కుంగ్ ఫూ యోగ సినిమాతో, వరల్డ్ వైడ్ గా సరికొత్త గుర్తింపును బ్యాగ్ లో వేసుకోనుంది ఇండియన్ సినిమా.

రీసెంట్ గా రిలీజైన యాక్షన్ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ ‘కుంగ్ ఫూ యోగ’ లో జాకీచాన్ బాలీవుడ్ స్టైల్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఇటు రాజస్థాన్ లోని కొన్ని ఇంటరెస్టింగ్ లొకేషన్ లతో పాటు, చైనా లోని మ్యూజియం ఆఫ్ చైనా లో షూటింగ్ జరుపుకున్న ‘కుంగ్ ఫూ యోగ’ అటు చైనీస్ కల్చర్, ఇటు ఇండియన్ కల్చర్ కాంబినేషన్ లో ఎట్రాక్ట్ చేస్తుంది. సింహాలు, కార్ చేజింగ్ సీన్స్ హైలెట్ గా నిలిచిన ట్రేలర్ సంథింగ్ స్పెషల్ మూవీ అనిపించుకుంటుంది.

సూపర్ స్టార్ జాకీచాన్, సోను సూద్, దిశా పటాని, అమిరా దస్తర్, ఎరిక్ సాంగ్,  జాంగ్ గౌళి, యోగ మాస్టర్ ముఖిమియా నటించిన ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ, మాండరిన్ భాషల్లో రిలీజవుతుంది. సింగపూర్, చైనా దేశాల్లో జనవరి లాస్ట్ వీక్ లో రిలీజవుతున్న కుంగ్ ఫు యోగ, ఇండియాలో ఫిబ్రవరి 3 న రిలీజవుతుంది.