చేనేతకు బ్రాండ్ అంబాసిడర్

Wednesday,January 18,2017 - 10:20 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాలకు చేయూతనందించేందుకు, వాళ్ల జీవితాాల్ని మెరుగుపరిచేందుకు… పవన్ ఇలా స్వచ్ఛంధంగా ముందుకొచ్చారు. చేనేత వస్త్రాలకు ఉచితంగా ప్రచారం కల్పించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన చేనేత కార్మిక సంఘాల నేతలు పవన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేనెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పవర్ స్టార్ ను కోరారు. దీనికి పవన్ అంగీకరించారు. చేనేతను జాతి సంపదగా చెప్పుకొచ్చిన పవన్… చేనేత కుటుంబాల్ని ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని ప్రకటించారు.

pawan-handloom-zee-cinemalu