1000 కోట్లు వసూలు చేసిన కుంగ్ ఫూ యోగ

Friday,February 10,2017 - 09:04 by Z_CLU

జాకీచాన్, సోను సూద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సైనో – ఇండియన్ వెంచర్ కుంగ్ ఫూ యోగ, సైలెంట్ గానే రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఒక్క చైనాలోనే 1000 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచంలోని అన్ని వుడ్ లను ఎట్రాక్ట్ చేస్తుంది.

జాకీచాన్, సోనుసూద్ కాంబినేషన్ లో తెరకెక్కిన కుంగ్ ఫు యోగ లో జాకీచాన్ బాలీవుడ్ స్టైల్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ కూడా ప్రమోట్ చేసి సపోర్ట్ చేశారు.

అమైరా దస్తూర్, దిశా పటాని హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ అప్రీషియేషన్స్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. చైనా లో 28 జనవరి, ఇండియాలో ఫిబ్రవరి 3 న రిలీజైన కుంగు ఫూ యోగ ఇప్పటికీ అదే స్ట్రెంత్ తో బాక్సాఫీస్ ని నింపుకునే పనిలో ఉంది.