ఆ హీరో కి హిట్ ఇవ్వడం నా భాద్యత

Tuesday,January 03,2017 - 04:00 by Z_CLU

సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ లేటెస్ట్ గా  ఓ హీరో కి హిట్ ఇవ్వడం నా బాధ్యత అనే కామెంట్ చేశారు. ఇంతకీ ఆ హీరో కి హిట్ ఇవ్వడం వినాయక్ ఎందుకు భాద్యతగా ఫీలవుతున్నాడు? అసలు ఆ హీరో ఎవరు?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ను ‘అఖిల్’ సినిమాతో వినాయక్ హీరోగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అక్కినేని రేంజ్ లో నిలబడలేదు. అక్కినేని అభిమానులతో పాటు, నాగార్జున అంచనాల్ని అందుకోలేకపోయింది. అందుకే ఈసారి అఖిల్ కు ఎలాగైనా ఓ బ్లాక్ బస్టర్ అందిస్తానంటున్నాడు వినాయక్. ప్రస్తుతం చిరంజీవితో ఖైదీ నంబర్-150 సినిమాను తెరకెక్కిస్తున్న ఈ స్టార్ డైరక్టర్… కుదిరితే అఖిల్ తో మరో సినిమా చేసి, ఫ్యాన్స్ గర్వించే సినిమాను అందిస్తానంటు న్నాడు. అఖిల్ కి ఓ హిట్ బాకీ పడ్డానని, కచ్చితంగా అఖిల్ కి హిట్ ఇవ్వడం తన భాద్యతని అంటున్నాడు వినాయక్. అయితే అఖిల్ తో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తాననే విషయం మాత్రం ఇంకా తనకు తెలియదంటున్నాడు.