'ఖైదీ నంబర్ 150' టీజర్ రివ్యూ

Thursday,December 08,2016 - 07:25 by Z_CLU

మెగా స్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఖైదీ నంబర్ 150 ‘ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అవ్వడం తో మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసారు. అందరూ ఎదురుచూస్తున్న మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150 ‘ సినిమా టీజర్ ఎట్టకేలకి రిలీజ్ అయింది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మెగా టీజర్ ఎలా ఎట్రాక్ట్ చేసిందో? ఓ లుక్ వేసుకోండి.

mega-star-teaser-1

ఒక ఫైట్ సీన్ తో మొదలైన ఈ టీజర్ ఆ తరువాత మెగా స్టార్ లుక్, స్టైల్, డైలాగ్ తో విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆరు పదుల వయసులోనూ సరి కొత్త స్టైల్ లో కనిపిస్తూ టీజర్ లో అందరినీ మెస్మరైజ్ చేసాడు చిరు.

mega-teaser-5

‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా ఏ స్వీట్ వార్నింగ్’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ ఈ టీజర్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. గతం లో చిరు కి ఎన్నో పదునైన డైలాగ్స్ రాసిన పరుచూరి బ్రదర్స్ మరో సారి చిరు తో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించారు.

mega-teaser

టీజర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. మెయిన్ గా టీజర్ క్లైమాక్స్ లో ‘ఖ ఖ ఖైదీ నంబర్ వన్ ఫైవ్ జీరో బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ వచ్చే మ్యూజిక్ మెగా అభిమానుల్లో అప్పుడే పండగ వాతావరణం తీసుకొచ్చింది.

mega-teaser-6

టీజర్ లో వినాయక్ మేకింగ్ స్టైల్, రత్న వేలు సినిమాటోగ్రఫీ అదుర్స్. ఫైనల్ గా సీ యూ ఆన్ సంక్రాంతి అంటూ టీజర్ కు ఎండింగ్ ఇచ్చాడు ఖైదీ. ఓవరాల్ గా అన్ని అంశాలతో కూడిన మెగా పవర్ పాక్ టీజర్ గా ఖైదీ నంబర్ 150 టీజర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ అలరించింది.