అఖిల్ నిశ్చితార్థానికి అనూప్ సంగీతం

Thursday,December 08,2016 - 05:23 by Z_CLU

మరికొన్ని గంటల్లో అఖిల్-శ్రియ భూపాల్ ల నిశ్చితాార్థం అంగరంగ వైభవంగా జరగనుంది. ఎంగేజ్ మెంట్ కు సంబంధించి అతికొద్దిమందిని మాత్రమే ఆహ్వానించిన అక్కినేని నాగార్జున.. .పూర్తిగా ఫ్యామీలీ ఎఫైర్ గా ఎంగేజ్ మెంట్ వేడుకను నిర్వహించాలని నిర్ణయించాడు. అయితే ఉన్న కొద్దిమంది అతిథులనే అలరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

Anup Rubens, Akhil Akkineni @ Akhil Movie Platinum Disc Function at Port Stadium, Vizag

తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ నిశ్చితార్థ వేడుకకు అనూప్ రూబెన్స్ తో గానాభజానా ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. నిశ్చితార్థ వేడుక జరిగే జీవీకే హౌజ్ ప్రాంగణంలోనే రాత్రి 9 గంటల ప్రాంతంలో అనూప్ తో మ్యూజికల్ నైట్ ఏర్పాటుచేసినట్టు సమాచారం. ఈ మ్యూజికల్ నైట్ లో ప్రముఖ గాాయనీగాయకులు తమ పాటలతో అలరించబోతున్నారు.

అఖిల్- శ్రియ నిశ్చితాార్థం రేపు రాత్రి సరిగ్గా 7 గంటలకు జరగుతుంది. వివాాహాన్ని ఇటలీలోని వెనిస్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మే నెలలో వెనిస్ లో ఈ పెళ్లి కళ్లుచెదిరే రేంజ్ లో జరగనుంది. వెనిస్ లో వివాహం తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేయబోతున్నాడు నాగార్జున.

akhil-engagement-card