జీ సినిమాలు (డిసెంబర్ 9th)

Thursday,December 08,2016 - 09:30 by Z_CLU

uma-sundari

నటీనటులు : ఎన్.టి.రామారావు, కన్నాంబ
ఇతర నటీనటులు : నాగయ్య, శ్రీ రంజని, రేలంగి, సురభి బాలసరస్వతి, నాగ భూషణం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జి.అశ్వత్దామా
డైరెక్టర్ : పి.పుల్లయ్య
ప్రొడ్యూసర్స్ : ఎం.సోమ సుందరం
రిలీజ్ డేట్ : 1956

నందమూరి తారక రామారావు నటించిన అద్భుత జానపద కథా చిత్రం ‘ఉమా సుందరి’. P.పుల్లయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ భూషణం, నాగయ్య, రేలంగి తదితరులు నటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్- కన్నాంబ నటన, రేలంగి కామెడీ, పాటలు సినిమాకు హైలైట్స్.

——————————————————————

sukravaram-maha-lakshmi

నటీనటులు : కుమార్ రాజా, సితార ,కె.ఆర్. విజయ, బేబీ షామిలి.
ఇతర నటీనటులు : సుత్తి వేలు, సాక్షి రంగారావు, జీవ, కాకా రావు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కృష్ణ తేజ
డైరెక్టర్ : రామ్ సురేష్
ప్రొడ్యూసర్స్ : కన్నెగంటి రామ్ మోహన్ రావు

కుమార్ రాజా, సితార జంటగా రామ్ సురేష్ దర్శకత్వం లో తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘శుక్రవారం మహా లక్ష్మి’. కె.ఆర్.విజయ మహాలక్ష్మి దేవతగా నటించిన ఈ సినిమాలో కొన్ని భక్తి సన్నివేశాలు, కె.ఆర్.విజయ నటన, కుమార్ రాజా సితార మధ్య వచ్చే సీన్స్, కృష్ణ తేజ సంగీతం హైలైట్స్.

——————————————————————

devatha-telugu-movie

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి
నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు
సంగీతం – చక్రవర్తి
దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు
విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

——————————————————————

raam-nithin
నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా
ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : N. శంకర్
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 30 మార్చి 2006

అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.

——————————————————————

naga-shourya-jadugadu

హీరో హీరోయిన్స్ : నాగ శౌర్య, సోనారిక
ఇతర నటీ నటులు : ఆశిష్ విద్యార్థి, అజయ్, జాకీర్ ఉస్సేన్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి,పృద్వి రాజ్, కోట శ్రీనివాస రావు
సంగీతం :సాగర్ మహతి
నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్
దర్శకత్వం : యోగి

అప్పటి వరకూ ప్రేమ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగ సౌర్య పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘జాదూ గాడు’. ఈ చిత్రం తో హీరో నాగ సౌర్య ను సరి కొత్త కోణం లో ఆవిష్కరించి అలరించాడు దర్శకుడు యోగి. యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ సన్నివేశాలు, క్లైమాక్స్, సాగర్ మహతి అందించిన పాటలు హైలైట్స్. శ్రీనివాస్ రెడ్డి. పృద్వి, రమేష్, సప్తగిరి కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. నాగ సౌర్య సరసన కథానాయికగా నటించిన సోనారిక తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

——————————————————————

naga-chaitanya-dochey-movie

హీరోహీరోయిన్లు – నాగచైతన్య, కృతి సనోన్
నటీనటులు – బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్
సంగీతం – సన్నీ
దర్శకత్వం – సుధీర్ వర్మ
విడుదల తేదీ – 2015, ఏప్రిల్ 24
స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.