గ్రాండ్ గా ‘మహానటి’ ఆడియో లాంచ్

Wednesday,April 25,2018 - 07:41 by Z_CLU

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మహానటి’ హంగామా కనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ‘మూగ మనసులు’ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే స్పీడ్ లో రేపు ఈ సినిమా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్  మే   1 న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేయనున్నారు.

హైదరాబాద్ లో జరగనున్న ఈ ఈవెంట్ లో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ ప్రిపరేషన్స్ లో  బిజీగా  ఉన్న  మహానటి ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఈ ఆడియో లాంచ్  ఈవెంట్ కి సంబంధించి మరిన్ని డీటేల్స్ అనౌన్స్ చేయనున్నారు.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కింది మహానటి. కీర్తిసురేష్ సీనియర్ నటి ‘సావిత్రి’ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా మే 9 న రిలీజవుతుంది.   మిక్కీ జె. మేయర్  మ్యూజిక్ కంపోజ్ చేశాడు.