'కాటమరాయుడు' హైలైట్స్

Thursday,March 23,2017 - 10:06 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీగా ఉంది. 144 నిమిషాల రన్ టైం లాక్ అయిన ఈ సినిమా డాలీ (కిషోర్ కుమార్ పార్దసాని) డైరెక్షన్ లో తెరకెక్కింది. కాటమరాయుడు మూవీలో మేజర్ హైలెట్స్ మీకోసం.

పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులంతా ఎదురుచూసేది కేవలం పవర్ స్టార్ కోసమే. సినిమా అంతా పవన్ మేజిక్ నడుస్తుంది. కాటమరాయుడుకే కాదు, పవన్ నటించిన ఏ సినిమాకైనా ఫస్ట్ అండ్ మెయిన్ ఎట్రాక్షన్ పవర్ స్టారే. మరీముఖ్యంగా తన కెరీర్ లోనే ఫస్ట్ టైం నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ నటించాడు.

కాటమరాయుడులో మరో ఎట్రాక్షన్ గబ్బర్ సింగ్ కాంబినేషన్. సూపర్ డూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ తర్వాత పవన్-శృతిహాసన్ కలిసి నటించిన సినిమా ఇది. వీళ్లిద్దరి కాంబినేషన్ కచ్చితంగా సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా రానుంది.

పవన్ కళ్యాణ్ కరియర్ లోనే ఫస్ట్ టైం రాయలసీమ యాసలో మాట్లాడాడు. రీసెంట్ గా రిలీజైన ట్రేలర్స్ లో అక్కడక్కడా మచ్చుకి వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఇప్పటికే హై ఎండ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.

పక్కా ఫ్యామిలీ & కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన కాటమరాయుడు లో హైలెట్ గా నిలిచే మరో పాయింట్ ట్రైన్ ఎపిసోడ్. ఇంటర్వెల్ కి కాస్త ముందుగా వచ్చే ఈ ఎపిసోడ్… అందునా పంచె కట్టులో పవన్ కళ్యాణ్ చేసే ఫైట్స్ సినిమాకి పెద్ద హైలెట్.

పవన్ కళ్యాణ్ కరియర్ లోనే ఫస్ట్ టైం నలుగురు తమ్ముళ్ళకు అన్నయ్యలా నటిస్తున్నాడు. దానికి తోడు అటు హీరోయిన్ ఫ్యామిలీ ఇటు తమ్ముళ్ళను కాపాడుకునే ప్రయత్నంలో పవర్ స్టార్ ఎమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి ప్రాణం పోశాయట.

పవన్-శృతి మధ్య రొమాంటిక్ ట్రాక్ సినిమాకు మరో హైలెట్. గబ్బర్ సింగ్ తోనే ఈ జంట నూటికి నూరు మార్కులు కొట్టేసింది. కాటమరాయుడులో ఆ డోస్ ఇంకాస్త పెరిగిందని టాక్. ప్రమోషన్ లో భాగంగా విడుదలైన స్టిల్స్ చూస్తుంటే… పవన్-శృతి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోవడం గ్యారెంటీ అనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే 100% ఎంటర్ టైన్ మెంట్. అలాంటి పవర్ స్టార్ కు అలీ కూడా తోడైతే ఇక కామెడీ కితకితలే. కాటమరాయుడులో అలీ కూడా ఉన్నాడు. పైగా వీళ్లిద్దరి కామెడీ ట్రాక్ కిర్రాక్ అనిపించేలా ఉందని ఇప్పటికే టాక్ కూడా వచ్చింది.

సినిమాలో మరో మేజర్ హైలెట్ మ్యూజిక్. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు క్యాచీ ట్యూన్స్ అందించాడు. మరీ ముఖ్యంగా మిర మిర మీసం, జివ్వు జివ్వు అనే పాటలు హిట్ అవ్వడంతో పాటలు కూడా సినిమాకు హైలెట్ గా మారిపోయాయి. వీటికి లొకేషన్లు కూడా తోడయ్యాయి.

కాటమరాయుడు సినిమాకు దర్శకత్వం కూడా కచ్చితంగా మేజర్ హైలెట్ అవుతుంది. ఎందుకంటే సెన్సిబుల్ మూవీస్ ను తెరకెక్కించడంలో డాలీ నంబర్ వన్. కథను, పవన్ ను బ్యాలెన్స్ చేస్తూ డాలీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

ఇక సినిమాకు ఆయువుపట్టులాంటి క్లయిమాక్స్ కూడా కాటమరాయుడుకు పెద్ద ఎస్సెట్ కాబోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా క్లైమాక్స్ పైనే హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మూవీ క్లైమాక్స్ లో పవన్ తన విశ్వరూపం చూపించాడని టాక్.