మాహిష్మతి సామ్రాజ్యంలో బాహుబలి 2 ఈవెంట్

Thursday,March 23,2017 - 11:51 by Z_CLU

మాహిష్మతి కింగ్ డమ్ లో బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మార్చి 26 న జరగబోయే ఈవెంట్ కోసం స్పెషల్ గా మాహిష్మతి సెట్ నిర్మిస్తున్నారు. తన ప్రతి సినిమా ప్రమోషన్ ని సరికొత్తగా ప్లాన్ చేసుకునే రాజమౌళి బాహుబలి 2 కోసం ఏకంగా కింగ్ డమ్ సెట్ నే ప్లాన్ చేశాాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే ఆడియోని కూడా రిలీజ్ చేస్తారు.

నిజానికి రామోజీ ఫిలింసిటీలో మాహిష్మతి సెట్ ఎప్పట్నుంచో ఉంది. అందులోనే మ్యాగ్జిమమ్ షూటింగ్ నడిచింది. అయితే యాజ్ ఇటీజ్ ఆ ఒరిజినల్ సెట్ లోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టడానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఎదురయ్యాయి.  అందుకే ఫిలింసిటీ బయట ఏర్పాటుచేస్తున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం మరోసారి చిన్న సైజు మాహిష్మతి సెట్ ను నిర్మిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఏప్రియల్ 28 న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.