వైజాగ్ లో కాటమరాయుడు

Wednesday,February 01,2017 - 01:52 by Z_CLU

కాటమరాయుడు వైజాగ్ కి బయలుదేరుతున్నాడు. ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్ ఏకంగా 20 రోజుల రెగ్యులర్ షూటింగ్ ని వైజాగ్ లో ప్లాన్ చేస్తుంది. ఫిబ్రవరి 6 నుండి పవర్ స్టార్ వైజాగ్ లో కాటమరాయుడు సెట్స్ పై ఉంటాడు.

డాలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ ఆప్ కమింగ్ అల్టిమేట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో పవన్ కళ్యాణ్ నలుగురు తమ్ముళ్ళకు అన్నయ్యగా నటిస్తున్నాడు.

katamarayudu-feature

గబ్బర్ సింగ్ తరవాత శ్రుతిహాసన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.