'భీష్మ' ... క్లారిటీ ఇచ్చాడు.

Wednesday,April 17,2019 - 01:29 by Z_CLU

నితిన్ -వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘భీష్మ’ మే నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి ని తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వెంకీ కుడుముల.

https://twitter.com/VenkyKudumula/status/1118180702527168512

సినిమాలో ఒకే ఒక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ రష్మిక చేస్తుందని ప్రకటించాడు. సో నితిన్ సినిమాలో రష్మిక మాత్రమే హీరోయిన్ అన్నమాట. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు.