వయొలెంట్ ప్రేమకథ.. గుణ369 టీజర్ టాక్

Monday,June 17,2019 - 12:40 by Z_CLU

కార్తికేయ నుంచి ముచ్చటగా మూడో సినిమా రెడీ అయింది. హిప్పీ వచ్చిన షార్ట్ గ్యాప్ లోనే గుణ369 ను రిలీజ్ కు రెడీచేశాడు ఈ హీరో. కొద్దిసేపటి కిందట ఈ సినిమా టీజర్ రిలీజైంది.

టీజర్ చూస్తుంటే ఇదొక అందమైన ప్రేమకథ అనే విషయం అర్థమౌతూనే ఉంది. దీనికి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా జోడించారు. బోయపాటి శ్రీను దగ్గర వర్క్ చేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సో.. టీజర్ లో యాక్షన్ షాట్స్ చూస్తుంటే బోయపాటి గుర్తుకురావడం సహజం.

టైటిల్ తర్వాత నంబర్ ఉన్న సినిమాలు చాలావరకు హిట్ అయ్యాయి. ఖైదీనంబర్150, రంగస్థలం 1985, అనంతపురం 1980 లాంటి సినిమాలు క్లిక్ అయ్యాయి. ఇప్పుడు ఇదే కోవలో గుణ369 కూడా వస్తోంది. దీనికి కూడా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.

ఇక కార్తికేయ విషయానికొస్తే, మూడో సినిమాకు ఇతడు మరింత మెరుగైనట్టు కనిపిస్తోంది. వాయిస్ మాడ్యులేషన్, యాక్షన్ సీన్స్ లో మెచ్యూరిటీ కనిపిస్తోంది. వచ్చేనెల మూడో వారంలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.