జీ ఎక్స్ క్లూజీవ్ : 'గుణ 369' రిలీజ్ డేట్

Tuesday,June 11,2019 - 10:02 by Z_CLU

ప్రస్తుతం ‘హిప్పీ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న కార్తికేయ వచ్చే నెలకి మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ కి సంబంధించి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జులై 19న రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో మళయాళీ బ్యూటీ అనఘ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.