పర్ఫెక్ట్ కాంబో ... రెడీ అవుతోందా..?

Monday,June 17,2019 - 04:08 by Z_CLU

శేఖర్ కమ్ముల తీసింది తక్కువ సినిమాలే కావొచ్చు కానీ అతనికంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలకు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ‘ఫిదా’ లాంటి సూపర్ హిట్ తర్వాత కొత్తవాళ్ళతో సినిమా చేస్తున్నాడు శేఖర్. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మరో మంచి ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడని తెలుస్తోంది.

లవ్ స్టోరీస్ కి పర్ఫెక్ట్ అనిపించే అక్కినేని హీరో నాగ చైతన్య తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడట శేఖర్ కమ్ముల. అంతే కాదు ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ అనే టాక్ వినబడుతుంది. ఈ బ్యూటిఫుల్ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడని, త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.

ఈ వార్త కానీ నిజమైతే టాలీవుడ్ లో పర్ఫెక్ట్ కాంబోలో పర్ఫెక్ట్ హిట్ డెలివరీ అవుతుందనడంలో సందేహమే లేదు . మరి ‘ఫిదా’ తో సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చిన శేఖర్ కమ్ముల మళ్ళీ సాయి పల్లవిని ఎలా ప్రెజెంట్ చేస్తాడో… నాగ చైతన్య కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో..చూడాలి.