అంజలి, లక్ష్మీ రాయ్ ప్రధానపాత్రల్లో "ఆనంద భైరవి"

Monday,June 17,2019 - 12:19 by Z_CLU

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రలో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా “ఆనంద భైరవి”. హరి వేన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రమేష్ రెడ్డి నిర్మాతగా రూపొందుతుంది.. బాలాజీ దర్శకుడు.

సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో అంజలి, ఆదిత్ అరుణ్ లపై ప్రేమ సన్నివేశాలు తీశారు. పృథ్వీ, బహ్మాజి, గుండు సుదర్శన్, జయవాణి లపై కొన్ని కామెడీ సీన్స్ తీశారు.

సినిమాలో ఆనందిని అనే పాత్రలో కనిపించనుంది అంజలి. ఈ క్యారెక్టర్ కోసమే ఆమె బాగా స్లిమ్ అయింది. మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో లక్ష్మీ రాయ్ పై యాక్షన్ సన్నివేశాల్ని తీయబోతున్నారు.

నటీనటులు:
అంజలి , లక్ష్మీ రాయ్ , ఆదిత్ అరుణ్, సుమన్, బ్రహ్మాజీ, మురళి శర్మ, జయప్రకాశ్

సాంకేతిక నిపుణులు :
స్కిప్ట్ కో ఆర్డినేటర్ : మధు విప్పర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సురేష్ దత్తి
ఎడిటింగ్ : చోట కె ప్రసాద్
కెమెరా : పీజీ విందా
మ్యూజిక్ : మణిశర్మ
ప్రొడ్యూసర్ : ఇటికేలా రమేష్ రెడ్డి
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : కర్రీ బాలాజీ