హిట్ కొట్టిన బ్యానర్ లో మరో మూవీ

Tuesday,October 29,2019 - 02:39 by Z_CLU

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది 118 సినిమా. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అదే విధంగా నిర్మాత మహేష్ కోనేరుకు కూడా 118 మంచి విజయాన్నందించింది. ఇప్పుడీ నిర్మాత, మరోసారి తన బ్యానర్ పై కల్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ హీరోగా మరో సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించాడు మహేష్ కోనేరు. రీసెంట్ గా విజిల్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ నిర్మాత, తన నెక్ట్స్ మూవీ కల్యాణ్ రామ్ తోనే అని స్పష్టంచేశాడు.

118కు థ్రిల్లర్ జానర్ సెలక్ట్ చేసుకున్న మహేష్, ఈసారి మరో కొత్త జానర్ టచ్ చేయబోతున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఎంతమంచివాడవురా సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మహేష్ కోనేరు నిర్మాణంలో చేయబోయే సినిమా డీటెయిల్స్ బయటకొస్తాయి.