అల్లు అర్జున్, సుకుమార్ మూవీ లాంఛ్ డీటెయిల్స్

Tuesday,October 29,2019 - 03:09 by Z_CLU

సుకుమార్ డైరక్షన్ లో మరోసారి నటించేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఓవైపు అల వైకుంఠపురములో సినిమాతో బన్నీ బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాను ప్రారంభిస్తున్నారు. దీనికో కారణం ఉంది.

సినిమాకు సంబంధించి ఓ కీలకమైన ఎపిసోడ్ షూట్ చేయాలని ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ ఇంపార్టెంట్ సీక్వెన్స్ కు బన్నీ అవసరం లేదు. ఈ గ్యాప్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమాను బన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అందుకే మూవీని లాంచ్ చేస్తున్నారు. నెల రోజుల తర్వాత బన్నీ సెట్స్ పైకి వస్తాడు.

గతంలో బన్నీ-సుక్కూ కాంబోలో ఆర్య, ఆర్య2 సినిమాలొచ్చాయి. ఇది హ్యాట్రిక్ మూవీ కానుంది. సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకునే ప్లాన్ లో ఉన్నారు. బన్నీ-రష్మిక కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. సుకుమార్ డైరక్ట్ చేయబోతున్న ఈ సినిమాకు ఎప్పట్లానే దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.

శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించే ఛాన్స్ ఉంది. మూవీలో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు బన్నీ.