నిర్మాతగా మంచు మనోజ్

Tuesday,October 29,2019 - 02:05 by Z_CLU

ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్, టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈసారి హీరోగా కాదు. నిర్మాతగా లక్ చెక్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ మంచువారబ్బాయి. ఈ మేరకు MM ARTS అనే బ్యానర్ ను స్థాపించాడు. త్వరలోనే నిర్మాతగా తన తొలి సినిమా విశేషాల్ని వెల్లడిస్తానంటున్నాడు.

మంచు ఫ్యామిలీలో ఇప్పటికే కొన్ని బ్యానర్లు ఉన్నాయి. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే సంస్థపై ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించారు మోహన్ బాబు. ఆ తర్వాత మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా ఓ బ్యానర్ స్థాపించాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనేది ఆ బ్యానర్ పేరు. ఇప్పుడీ లిస్ట్ లోకి మంచు మనోజ్ కూడా చేరాడు.

తన సొంత బ్యానర్ పై నిర్మించబోయే సినిమాలో మంచు మనోజ్, తనే హీరోగా నటిస్తాడా లేక మరో హీరోతో సినిమా ఎనౌన్స్ చేస్తాడా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఇప్పటికైతే తన ప్రొడక్షన్ హౌజ్ పేరు, లోగో డిజైన్ ను మాత్రమే రివీల్ చేశాడు. త్వరలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులముందుకురాబోతున్నాడు.