మహేష్ బాబు సరసన ఇలియానా

Saturday,October 06,2018 - 12:17 by Z_CLU

రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అయితే ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా మహేష్ బాబుతో మరో సినిమా చేయనుందట ఇలియానా. గతంలో ‘పోకిరి’ సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ జోడీ మరోసారి టాలీవుడ్ లో హీట్ జెనెరేట్ చేయనుంది. ఇది ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్.

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ‘ఇలియానా’ ను ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉందట సినిమా యూనిట్. ఆ విషయం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ, ఈ న్యూస్ మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ క్రియేట్ చేస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కరియర్ ప్లాన్ చేసుకుంటున్న ఇలియానా, తన రేంజ్ ఆఫర్స్ వస్తే నటించడానికి రెడీగానే ఉంది. కానీ మన ఫిల్మ్ మేకర్సే, అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు ఇలియానాను ప్రిఫర్ చేస్తారా..? లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.