ఎట్రాక్ట్ చేస్తున్న విజయ్ ఆంటోని ‘రోషగాడు’

Saturday,October 06,2018 - 10:01 by Z_CLU

విజయ్ ఆంటోని సినిమాలంటేనే సమ్ థింగ్ స్పెషల్. ఏ సినిమా చేసిన డిఫెరెంట్ కాన్సెప్ట్ తో చేస్తాడు. ఇప్పుడు  ‘రోషగాడు’ అనే టైటిల్ తో పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాతో వస్తున్నాడు విజయ్ ఆంటోని. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా థీమ్ సాంగ్, మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

విజయ్ ఆంటోని తన ప్రతి సినిమా లాగే ఈ సినిమాకి సొంతంగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ‘రోషగాడురా…’ అంటూ సాగే ఈ సాంగ్ లో హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. ఈ సినిమాలో ఉండబోయే ఎగ్జాక్ట్ కాంఫ్లిక్ట్ ఎలిమెంట్ అయితే ఇంకా రివీల్ కాలేదు కానీ, విజయ్ ఆంటోని ఈ సినిమాలో పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్ లో ఎంటర్ టైన్ చేయబోతున్నాడని తెలుస్తుంది.

గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.