అందరికీ లాభాలు: కాంచన-3 లేటెస్ట్ కలెక్షన్

Friday,May 03,2019 - 02:06 by Z_CLU

డబుల్ మాస్ ఎంటర్ టైనర్ కాంచన-3 సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది. నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బ్రేక్-ఈవెన్ క్రాస్ చేసి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది. ఇంకా చెప్పాలంటే ఈ 2 వారాల్లో బయ్యర్లకు 7 కోట్ల రూపాయల లాభం తెచ్చిపెట్టింది ఈ మూవీ.

విడుదలైన ఈ 14 రోజుల్లో కాంచన-3కి ఏపీ,నైజాం కలుపుకొని 17 కోట్ల 78 రూపాయల షేర్ వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి ఎంటరై దాదాపు 4 రోజులు అవుతోంది. బి, సి సెంటర్లలో స్ట్రాంగ్ గా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చింది. అటు ఓవర్సీస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది ఈ మూవీ.

ఏపీ, నైజాం 14 రోజుల షేర్
నైజాం – రూ. 5.82 కోట్లు
సీడెడ్ – రూ. 3.61 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.47 కోట్లు
ఈస్ట్ – రూ. 1.53 కోట్లు
వెస్ట్ – రూ. 1.12 కోట్లు
గుంటూరు – రూ. 1.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.64 కోట్లు
కృష్ణా – రూ. 1.29 కోట్లు