జై సింహా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

Wednesday,November 01,2017 - 05:08 by Z_CLU

బాలకృష్ణ 102వ సినిమా జై సింహా ఫస్ట్ లుక్ రిలీజైంది. ముందే చెప్పినట్టు సరిగ్గా 4 గంటల 44 నిమిషాలకు జై సింహా ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఎగ్రెసివ్ లుక్ లో బాలయ్య కనిపిస్తున్న స్టిల్ తో పాటు జై సింహా లోగో డిజైన్ ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఇక మోషన్ పోస్టర్ లో చిరంతన్ భట్ అందించిన సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

మోషన్ పోస్టర్ తో జై సింహా స్టోరీలైన్ ను కొద్దిగా రివీల్ చేసినట్టయింది. బ్యాక్ గ్రౌండ్ లో పెట్టిన ఎన్టీఆర్ విగ్రహం, రాజకీయ నాయకుల్లో గెటప్పుల్లో జూనియర్ ఆర్టిస్టుల్ని చూస్తుంటే.. ఈ సినిమాలో కాస్త పొలిటికల్ టచ్ ఉన్నట్టు అనిపిస్తోంది. కేఎస్ రవికుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సి.కల్యాణ్ నిర్మాత.

ప్రస్తుతం జై సింహా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. నయనతార, నటాషా జోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు.