మహేష్ సినిమాకు 3 ట్యూన్స్

Wednesday,November 01,2017 - 06:31 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో పాటు త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు. ఆ మూవీకి సంబంధించి కూడా తాజాగా కొన్ని ట్యూన్స్ ఫైనలైజ్ చేశాడు ఈ సంగీత దర్శకుడు.

కేవలం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమే అమెరికా వెళ్లాడు దేవిశ్రీప్రసాద్. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సంగీత చర్చలు ప్రారంభించాడు. మధ్యలో నిర్మాత దిల్ రాజు కూడా జాయిన్ అయ్యాడు. అలా కొన్నిరోజులుగా అమెరికాలో ఉన్న దేవిశ్రీప్రసాద్.. ఈ సినిమాకు 3 క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు.

దేవిశ్రీ కంపోజ్ చేసిన 3 పాటలు సూపర్ గా ఉన్నాయంటున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. జనవరి నుంచి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ మూవీకి కృష్ణా ముకుందా మురారి, హరేరామ హరేకృష్ణ అనే టైటిల్స్ లో ఏదో ఒకటి ఫిక్స్ చేయొచ్చంటూ పుకార్లు వచ్చినప్పటికీ.. అలాంటిదేం లేదంటున్నాడు దర్శకుడు.