హెబ్బా పటేల్ ఇంటర్వ్యూ

Wednesday,November 01,2017 - 04:45 by Z_CLU

హెబ్బా పటేల్, నాగ అన్వేష్  జంటగా నటించిన ‘ఏంజెల్’ నవంబర్ 3 న రిలీజవుతుంది. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

 

లైట్ హార్టెడ్ కమర్షియల్ మూవీ…

సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘ఏంజెల్’ మూవీ. ఈ సినిమాలో నేను ఏంజెల్ గా నటించాను. కుమారి 21 F తరవాత టైటిల్ రోల్ చేసినందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను…

అదే డిఫెరెన్స్…

నా ప్రీవియస్ సినిమాలకు ఈ సినిమాకు చాలా డిఫెరెన్స్ ఉంది. నా సినిమాల్లో నేను ఒక పార్ట్ లా ఉంటాను. కానీ ఏంజెల్ సినిమాలో మ్యాగ్జిమం మూవీ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

అదే ఏంజెల్ సినిమా…

అనుకోకుండా ఒక రీజన్ తో ఏంజజెల్ భూమిపైకి వస్తుంది. ఆ తరవాత హీరోని కలుసుకోవడం, ఇమ్మీడియట్ గా ఎక్స్ పెక్ట్ చేయని సిచ్యువేషన్సే ఏంజెల్ సినిమా…

అందుకే బ్రేక్ తీసుకున్నాను…

లాస్ట్ ఇయర్ కంప్లీట్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో మ్యానేజ్ చేయలేకపోయాను. బిజీ బిజీగా షూటింగ్స్  చేయడంతో నా బెస్ట్ ఇవ్వలేకపోతున్నానేమో ఫీలింగ్. అందుకే బ్రేక్ తీసుకుందామనుకున్నాను.

రెస్పాన్స్ బిలిటీ పెరిగింది…

నా ప్రీవియస్ సిన్మాల కన్నా ఈ సినిమా విషయంలో నా రెస్పాన్స్ బిలిటీ పెరిగింది. ఈ సినిమాలో నేను బబ్లీగా కాకుండా డిఫెరెంట్ గా కనిపించబోతున్నాను…

హీరో గురించి…

నాగ అన్వేష్ ఈ సినిమాలో చాలా కసిగా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమాలో ఎలాగైనా ప్రూఫ్ చేసుకోవాలనే ఇంటెన్సిటీ తో పనిచేశాడు. తను మంచి డ్యాన్సర్ కూడా…

గ్యాప్ లో నేను చేసేది అదే…

ముంబై లో కొత్త ఇల్లు తీసుకున్నాము. సో ప్రస్తుతం షిఫ్టింగ్ ప్రాసెస్ నడుస్తుంది…  ఎలాగూ బ్రేక్ లో ఉన్నాను కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాను.