అదే పెద్ద అచీవ్ మెంట్

Monday,October 30,2017 - 12:17 by Z_CLU

అక్టోబర్ 27 న గ్రాండ్ గా రిలీజైన ఈ యూత్ ఫుల్  ఇమోషనల్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సినిమా చూశాక ఫ్యాన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ ని ఎంజాయ్ చేస్తున్న ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

సాధారణంగా కామెడీ సినిమాలు చేసినప్పుడు థియేటర్స్ లలో చాలా సందడి ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో మాత్రం ఇమోషన్ సీన్స్ వచ్చినప్పుడు మొత్తం సైలెన్స్ అలుముకుంటుందని చెప్పుకున్న రామ్, ఈ సినిమా యూత్ ని ఎట్రాక్ట్ చేయడం గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ బిగినింగ్ నుండి ఉన్నా, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా అప్రీషియేట్ చేయడం గ్రేట్ చీవ్ మెంట్ అని చెప్పుకున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ వీటితో పాటు హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, రామ్ కరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలవడం ఖాయమనే అనిపిస్తుంది. ఈ సినిమాకి కిషోర్ తిరుమల డైరెక్టర్.